calender_icon.png 4 January, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతికతతో ‘ఇంజినీరింగ్’ మరింత సుస్థిరం

29-12-2024 02:53:42 AM

‘ఆర్‌ఏఎస్‌ఈఎఫ్‌టీ-2024’పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): ఇంజినీరింగ్‌లో శాస్త్ర, సాంకేతికతను జోడించడంతో భవిష్యత్తులో ఇంజినీరింగ్ వ్యవస్థ మరింత సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రీసెంట్ అడ్వాన్‌సెస్ ఇన్ సస్టున్‌బిలిటీ ఇంజినీరింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ (ఆర్‌ఏఎస్‌ఈఎఫ్‌టీ-2024) అనే అంశంపై నాదర్ గూల్‌లోని మాటూరి వెంకటసుబ్బారావు ఇంజినీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ శనివారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీఎల్ డైరెక్టర్ డాక్టర్ జీఏ శ్రీనివాసరావు, ప్రత్యేక అతిథులుగా డాటా అండ్ ఏఐ ఆర్కిటెక్చర్ గ్రూప్ లీడర్ సురేంద్ర తిప్పరాజు, ఎంజీపీఎల్ నారాయణ, డాక్టర్ లక్ష్మీనారాయణ, సదాశివులు, డాక్టర్ వై విజయలత తదితరులు పాల్గొన్నారు. అధునాతన పద్ధతులు, డిజిటలైజేషన్ వంటి థీమ్‌లపై దృష్టి సారించే కీలకమైన ప్రజెంటేషన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు.