calender_icon.png 13 December, 2024 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్‌లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

12-12-2024 10:45:19 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ లో ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘట్కేసర్  ఏక్సైస్  స్టేషన్ హౌస్ ఆఫీసర్ జూప్పల్లి రవి తెలిపిన వివరాల ప్రకారం... ఏక్సైస్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ ఆదేశాల మేరకు బోడుప్పల్ లో వీరేంద్ర అనే వ్యక్తి బీహార్ నుండి గంజాయి చాకలెట్స్ తెచ్చి అమ్ముతున్నాడని పక్కా సమాచారం అందింది. దీంతో ఘట్ కేసర్ లిమిట్ బి బృందం గురువారం బోడుప్పల్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుని నుండి 4.957 కేజీల గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి విచారణ కొరకు ఘట్ కేసర్ ఎస్.హెచ్ఓకు అప్పగించారు.