calender_icon.png 3 April, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ పూజారి ఏడాది వేతనం రూ.60 వేలు

02-04-2025 08:11:41 PM

ఇవ్వడానికి ముందుకు వచ్చిన సహృదయ సహోదరులు..

ట్రస్ట్ నిర్వహణ లోపం వల్లనే ఎండోమెంట్ నిధులు వెనుకకు.. 

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం, నాగులపాడు గ్రామానికి చెందిన క్రీ.శే. సంకరమది నర్సిరెడ్డి కళావతి దంపతుల కుమారులు నాగార్జున రెడ్డి శ్రవణ్ రెడ్డి తమ సొంత ఖర్చులు వెచ్చించి గ్రామ దేవాలయ పూజారి ఏడాది వేతనాన్ని తాము భరిస్తున్నట్లు గ్రామస్తుల సాక్షిగా ప్రకటించారు. గ్రామంలోని కాకతీయుల కాలంనాటి త్రిపుకేశ్వర ఆలయం, ఆలయం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి. దేవాదాయ శాఖ గతంలో కొన్ని సంవత్సరాలుగా పూజారి, దూపదీప నైవేద్యలకు రూ.10 వేలు వచ్చాయి. అనివార్య కారణాల వల్ల ఆలయం ట్రస్ట్ నిర్లక్ష్యం మూలంగా పూజారిని తొలగించడంతో నిధులు వెనుకకు పోయాయి.

దీంతో నిధులు లేకపోవడం వల్ల పూజారి సమస్య తీవ్రతరం అయింది. కాగా శివ-పార్వతులు, హనుమాన్ స్వాములు దూప దీప నైవేద్యాలకు కరువైయ్యాయి. తెలుసుకున్న గ్రామ సహృదయ దాతలు సోదరులు నాగార్జున రెడ్డి, శ్రవణ్ రెడ్డి లు ముందుకొచ్చి పూజారి వేతనం కోసం నెలనెల 5000 రూపాయలు చొప్పున సంవత్సరానికిరూ. 60 వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చి దాతృత్వం చాటుకున్నారు. అలాగే గ్రామ, ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని గ్రామస్తులు, భక్తుల సాక్షిగా ప్రకటించడంతో సోదరులకు హర్ష ద్వానాల నడుమ అభినందనలు తెలిపారు.