01-03-2025 12:00:00 AM
2024లో ఆన్‌లైన్ మోసాలు భయానకంగా పెరిగాయి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇస్‌స్టాగ్రామ్ వంటివాటిని స్కామర్లు దుర్వినియోగం చేస్తూ, నకిలీ ఖాతాలు, హానికరమైన లింకులు, ఏఐ ఆధారిత సాంకేతికతలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఫలితంగా భారీ ఆర్థిక నష్టాలు నమోదవుతున్నాయి. 2024 తొలి భాగంలోనే భారత్‌లో రూ. 11,000 కోట్లకు పైగా నష్టం సంభవించినట్టు అంచనా.
రోజు కు 6,000 ఫిర్యాదులు ‘నేషనల్ సైబర్ క్రైమ్’ పోర్టల్‌లో నమోదవుతుండగా, అంతర్జాతీయంగా ఈ న ష్టం రూ. 85.49 లక్షల కోట్లకు చేరుకుంది. ఏఐ ఆధారిత మోసాల పెరుగుదలతో డీప్‌ఫేక్ టెక్నాలజీ, ఆటోమేటెడ్ ఫిషింగ్ పద్ధతులు వాళ్ల దుర్మార్గాలను మరింత ప్రమాదకరంగా మార్చాయి. సోషల్ మీడి యా వేదికలు స్కామర్లకు ప్రధాన కేంద్రాలుగా మా రాయి.
పెట్టుబడి మోసాలు, ఉద్యోగ మోసాలు, డిజిటల్ లోన్ యాప్ మోసాలు వంటివి బలహీన వర్గా లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ వంటి వేదికలు సైబ ర్ నేరగాళ్లకు అవకాశంగా మారాయి. దీనిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం గూగుల్, మెటా వం టి టెక్ దిగ్గజాలతో కలిసి కఠిన చర్యలు చేపడుతున్న ది.
‘నేషనల్ సైబర్ క్రైమ్’ థ్రెట్ అనలిటికల్ యూని ట్ వారు బ్యాంకులు, పోలీసులతో కలిసి ఆర్థిక మో సాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 5.75 లక్షలమంది బాధితులకు రూ. 16 బిలియన్ల మేర నష్టపరిహారం అందినట్టు సమాచారం.
సైబర్ మోసాల బారినపడకుండా ఉండేం దుకు అనుమానాస్పద లావాదేవీలను ధృవీకరించడం, నకిలీ సందేశాలను క్రాస్‌చెక్ చేయడం, సోష ల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదనే జా గ్రత్తలు తీసుకోవడం ప్రజలకు అవసరం. మోసానికి గురైతే వెంటనే బ్యాంకులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వ నియంత్రణ, టెక్ సంస్థల చర్యలు, ప్రజల అప్రమత్తత కీలకం అని అందరం గుర్తించాలి.
డా. కృష్ణకుమార్ వేపకొమ్మ