మంచిర్యాల, జూన్ 30(విజయక్రాంతి): మంచిర్యాలలో నిర్వహించిన యూనిక్స్ సన్‌రైస్ పదో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ హాజరై మాట్లాడారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో శ్రీరాం పూర్ జీఎం సంజీవరెడ్డి, టోర్నమెంటు కన్వీనర్ ముఖేష్‌గౌడ్, అబ్జర్వర్ యూవీఎన్ బాబు, రెపరీ మల్లికార్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్లూరి సుధాకర్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు వాసు, మీనారెడ్డి, సత్యపాల్ రెడ్డి, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మెన్ సింగిల్స్‌లో కే లోకేష్‌రెడ్డి విన్నర్‌గా, ఎం అజయ్ కార్తీక్ రన్నర్‌గా, పీ సాహస్ కుమార్ తృతీయ, ప్రణవ్ సామాల నాలుగవ స్థానంలో నిలిచారు.
ఉమెన్ సింగిల్స్‌లో కే శ్రేష్ఠారెడ్డి , ఎస్ రక్షితశ్రీ, ఎం కీర్తి, ఏ అభిలాష మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. మెన్స్ డబుల్స్‌లో వర్షిత్‌రెడ్డి, విఘ్నేష్ జోడి విన్నర్‌గా, కీర్తి శశాంక్, సుధీష్ వెన్‌కర్ జోడి రన్నర్‌గా, ఉమెన్ డబుల్స్‌లో ఏ అభిలాష, దేవినేని లక్ష్మీ రిధిమ జోడీ విన్నర్‌గా, అశ్రిత కందుల, శ్రీసాయి శ్రావ్య జోడి రన్నర్‌గా, మిక్స్ డబుల్స్‌లో కే సాత్విక్‌రెడ్డి, వైష్ణవి ఖద్కేకర్ జోడి విన్నర్‌గా, టీ విఘ్నేష్, శ్రీసాయి శ్రావ్య లక్కంరాజు జోడి రన్నర్‌గా నిలిచారు. విజేతలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు.