28-02-2025 06:06:32 PM
వెల్లడించిన సమితి రాష్ట్ర అధ్యక్షులు బినయ్ కుమార్ యాదవ్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గామాత దేవాలయం ఇందిరా నెహ్రూ నగర్ మల్కాజిగిరిలో తెలంగాణ బీహార్ సహయోగ్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బినయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అఖండ అష్ట్యం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉమాకాంత్ యాదవ్, బాలమ్ రాయ్ తన బృందంతో హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా భోజ్‌పురి కమ్యూనిటీ, రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన గిర్జా శంకర్ బియాస్, ధనంజయ్ సింగ్, పప్పు సింగ్ సంతోష్ సింగ్, సచిన్ సింగ్, బాలాజీ నగర్‌కు చెందిన భవేష్ యాదవ్ తన బృందంతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ హహరాం గౌడ్, హహ్యా రాం గౌడ్, బీజేపీ నాయకులు హాజరయ్యారని చెప్పారు.
ఈ సందర్భంగా కృష్ణ హరే కృష్ణ కీర్తనలు ఆలపించి, ప్రసాదాన్ని స్వీకరించిన ప్రజలందరికీ స్వాగతం పలికారు. అనంతరం కమిటీలోని సీనియర్ అధికారులు జయనాథ్ సింగ్, శంభునాథ్ భగత్, దశరథ్ సింగ్, కామేశ్వర్ భగత్, చంద్ర దేవ్ సింగ్, సుభాష్ యాదవ్, రాజ్‌నందన్ సింగ్, గేయానంద్ రాయ్, సురేశ్ యాదవ్, ప్రజలందరికీ ఘన స్వాగతం పలికారన్నారు. భగత్, ఉత్తమ్ యాదవ్, లాలన్ మిశ్రా, ఆనంద్ గుప్తా, దీపక్ గుప్తా, మనోజ్ భగత్, సునీల్ భగత్, మున్నా భగత్, రంజిత్ యాదవ్, బినోద్ గుప్తా, ఎం.బిజేంద్ర గుప్తా, గోవింద్ యాదవ్, జితేంద్ర గుప్తా, సునీల్ యాదవ్, గోపాల్ భగత్, గుల్షన్ కుమార్, సతీష్ యాదవ్, మున్నా యాదవ్, ప్రభూ ఖాండ్, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.