calender_icon.png 30 September, 2024 | 1:00 AM

ముగిసిన జానీమాస్టర్ కస్టడీ

29-09-2024 02:27:06 AM

చంచల్‌గూడ జైలుకు తరలింపు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 28: నాలుగు రోజుల కస్టడీ అనంతరం నార్సింగి పోలీసులు శనివారం జానీ మాస్టర్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి వచ్చే నెల 3వరకు రిమాండు విధించారు. పోలీసులు అనంతరం ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా విచారణ సాగినట్లు తెలుస్తున్నది. నిందితుడు మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదనని, కావాలనే పిర్యాదుదారు తనను కేసులో ఇరికించిందని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. 

ఫిర్యాదుదారు జానీమాస్టర్‌ను ట్రాప్ చేసిందని ఫిర్యాదు

మరోవైపు జానీ మాస్టర్‌ను ఉప్పర్‌పల్లి కోర్టుకు తీసుకొస్తున్నారే మోననే అనుమానంతో జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా కోర్టుకు వచ్చారు. జానీ రాలేదని తెలుసుకుని ఆమె వెంటనే కోర్టు నుంచి వెళ్లిపోయారు.

అనంతరం ఆమె ఫిలిం చాంబర్‌కు చేరుకుని, ఫిర్యాదుదారు ఉద్దేశపూర్వకంగా తన భర్త జానీమాస్టర్‌ను ట్రాప్ చేసిందని, అవకాశాల కోసం ఆయ న్ను వినియోగించుకుందని ఫిర్యాదు చేసి ది. ప్రేమ పేరుతో జానీ మాస్టర్‌ను వేధించిందని ఫిర్యాదులో పేర్కొన్నది. ఫిర్యాదుదారు తల్లి కూడా తమను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించింది.