మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో శుక్రవారం ప్రారంభమైన ఫ్యూషన్ ఫెస్ట్ శనివారంతో ముగిసింది. ఫ్యూషన్ టెస్ట్ లో విద్యార్థులు వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అందరిని అలరించాయి. ఫెస్ట్ ను తిలకించేందుకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సేక్రెడ్ హార్ట్ చర్చ్ పారిష్ ప్రీస్ట్ ఫాదర్ జోస్, మాజీ ప్రిన్సిపాల్ సిస్టర్ ఫినియా, కార్మెల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు మదర్ జియో, ప్రిన్సిపాల్ సిస్టర్ రిన్సీ, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.