సెంట్ లూసియా: టీ20 ప్రపంచకప్‌ను మాజీ చాంపియన్ శ్రీలంక విజయంతో ముగించింది. సోమవారం సెంట్ లూసియా వేదికగా గ్రూప్ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక జట్టు 83 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. చరిత్ అసలంక (21 బంతుల్లో 46, 1 ఫోర్, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు.
కుషాల్ మెండిస్ (29 బంతుల్లో 46, 5 ఫోర్లు) రాణించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 2 వికెట్లు తీయగా.. కింగ్మా, ఆర్యన్ దత్, వాన్ మీక్రెన్, టిమ్ ప్రింగిల్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 16.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. స్కాట్ ఎడ్వర్డ్స్ (24 బంతుల్లో 31), మైకెల్ లెవిట్ (23 బంతుల్లో 31) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో నువాన్ తుషారా 3 వికెట్లు పడగొట్టగా.. హసరంగా, పతీరాణాలు చెరో 2 వికెట్లు తీశారు.