calender_icon.png 17 October, 2024 | 5:53 AM

టీబీ మహమ్మారిని రూపుమాపాలి

17-10-2024 03:42:33 AM

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రం నుంచి టీబీ మహమ్మారిని పూర్తిగా రూపుమాపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. బుధవారం రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర టీబీ అసోసియేషన్ 5వ వార్షిక సమావేశం, 75వ సీల్ సేల్ క్యాంపెయిన్‌ను గవర్నర్ ప్రారంభించారు. టీబీ నియంత్రణ కోసం జాతీయ టీబీ నియంత్రణ విధానాలను వైద్యులు అనుసరించాలని కోరారు.

2025 నాటికి టీబీ రహిత దేశంగా మార్చేందుకు అంద రూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర టీబీ అసోసియేషన్ వైస్ చైర్మన్లుగా డాక్టర్ సీఎన్ సుధీర్ ప్రసాద్, డాక్టర్ సీఎన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బాలచందర్ ఎన్నికయ్యారు. కాగా ఈ సంఘానికి గవర్నర్ చైర్మన్‌గా ఉంటారు. కార్యక్రమానికి డాక్టర్ టీవీ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.