calender_icon.png 10 January, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మె విరమించి విధుల్లో చేరండి

31-12-2024 02:43:22 AM

  1. కేజీబీవీలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు
  2. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
  3. సర్వ శిక్షా ఉద్యోగులతో మంత్రులు పొన్నం, సీతక్క

హైదరాబాద్, డిసెంబర్ 30(విజయక్రాం తి): సర్వ శిక్షా ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు 19,500 మంది తక్షణమే సమ్మె విర మించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కోరారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టి లో పెట్టుకొని విధుల్లో చేరాలని చెప్పారు. సోమవారం సర్వ శిక్షా ఉద్యోగులతో మం త్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరామ్ సచివాలయంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సమ్మె చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేజీబీ వీ పాఠశాలల్లో బడగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని గుర్తుచేశారు. సుధీ ర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని, తమను రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వ శిక్షా ఉద్యోగులు మంత్రులను కోరారు.

కస్తూర్బా గాంధీ పాఠశాలల నిర్వహణ కేంద్రం పరిధిలో 60 శా తం రాష్ర్టం పరిధిలో 40 శాతం ఉంటుంద ని మంత్రులు వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఉద్యోగులకు చెప్పారు. సర్వ శిక్షా ఉద్యోగుల సమస్య ఒక్క తెలంగాణలోనే లేదని, దేశవ్యాప్తంగా ఉన్నట్టు వివరించారు.

సీఎం దృష్టికి తీసుకుపోయి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు సమ్మె చేయడం వల్ల విద్యాబోధన జరగక విద్యార్థులు నష్టపోతున్నారన్నారు.  సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సర్వ శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డ్డి పాల్గొన్నారు.