calender_icon.png 23 February, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ అండ్ పిసి డ్రిల్, పిటి ఇన్స్ట్రక్టర్ శిక్షణ తరగతుల ముగింపు

22-02-2025 06:00:37 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కార్పొరేట్ ఏరియా(Singareni Corporate Area)లోని గత రెండు వారల పాటు జరిగిన, ఎస్ & పిసి డ్రిల్ మరియు పీటీ ఇన్ స్ట్రక్టర్ శిక్షణా తరగతుల, ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందా లక్ష్మి నారాయణ, జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ) హాజరయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది ముఖ్యం అని, మనం క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నపుడే మనకు గుర్తింపు వస్తుందని, డ్రిల్ మరియు పి.టి. ఇన్ స్పెక్టర్ శిక్షణ భవిష్యత్తులో చాలా  ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. ఈ శిక్షణ వలన ఎస్ & పిసి సెక్యూరిటీ సిబ్బంది క్రమశిక్షణతో డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్ చేస్తూ, తమ శారీరక, మానసిక ధారుడ్యం పెంపొందించుకొని అందరు తమ విధులను, సక్రమంగా నిర్వహించేందుకు దోహదం చేస్తుంది. యస్& పిసి విభాగము పటిష్టంగా ఉండేందుకు కావలసిన అన్ని రకాల చర్యలు, సెక్యూరిటీ సిబ్బందికి అన్ని రకాల వాతావరణం నుండి రక్షణ కోసం ప్యాబ్రికేటెడ్ చెక్ పోస్టుల కోసం కృషి చేయడం జరుగుతుంది. యస్& పిసి ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు యాజమాన్యం అందిస్తుంది కాబట్టి,సెక్యూరిటీ సిబ్బంది అందరు మెరుగైన వృత్తి నైపుణ్యంతో, అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ, సింగరేణి ఆస్తులు, స్థలాలను పరిరక్షించాలని, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అనంతరం ఉత్తమ ట్రైనీ లుగా ఎంపికైనా,శ్రీ యన్. మల్లికార్జున్ రావు, ఆర్. అనిల్ కుమార్ లకు బహుమతి ప్రదానం చేశారు. శిక్షణా సిబ్బంది అందరూ జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ)  చేతుల మీదుగా శ్రీ జ్యోతి అనాథ వృద్ధుల శరణాలయ నిర్వాహకులకు నిత్యావసర వస్తువులు వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో డి.నారాయణరెడ్డి, ట్రైనింగ్ ఇన్ స్పెక్టర్, జి. భాస్కర్ రెడ్డి, జమేదార్, ట్రైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.