calender_icon.png 27 October, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో గోధ్వజ్ యాత్రకు ముగింపు

27-10-2024 02:03:43 AM

దేశ రాజధానిలో గోధ్వజ్ స్థాపన చేసిన

శంకరాచార్య స్వామీజీ స్వామీజీని దర్శించుకున్న 

ఎంపీ రాఘవ్ చడ్డా, పరిణీతి చోప్రా దంపతులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగిన గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర దేశ రాజధాని ఢిల్లీలో ముగిసింది. 36 రోజుల పాటు సాగిన యాత్రలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి గోధ్వజ స్థాపన చేశారు. చివరిగా శనివారం ఢిల్లీలోని ప్రీతంపుర నరసింహ సేవా సదన్ ప్రాంగణంలో గోప్రతిష్ఠ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం రాజ్‌పూర్ రోడ్‌లోని షా ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వామీజీ భక్తులను ఉద్దే శించి మాట్లాడారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న శంకరాచార్య స్వామీజీకి రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా దంపతులు ఘనస్వాగతం పలికారు. వారి నివాసానికి వెళ్లి దంపతులను స్వామీజీ ఆశీర్వదించారు. గోధ్వజ్ స్థాపన అనంతరం శంకరాచార్య స్వామీజీ తన అనుచరులతో బృందావన్ ధామ్‌కు బయలుదేరారు. ఆదివారం ఉదయం భగవాన్ బాంకే బీహారీ దర్శనం చేసుకుంటారు. గో ఆందోళన్‌లో భాగంగా తర్వాతి కార్యాచరణను ఇక్కడి నుంచే ప్రకటించే అవకాశముంది.