ఉమ్మడి జిల్లా అటవీశాఖ కన్జర్వేటర్ శాంతారామ్
కుమ్రం భీం అసిఫాబాద్, (విజయ క్రాంతి): గిరిజన కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అటవీ శాఖ కృషి చేస్తుందని ఉమ్మడి జిల్లా అటవీ శాఖ కన్జర్వేటర్ శాంతారామ్ అన్నారు. జై నూర్ మండలానికి చెందిన మడవి ఆనంద్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని డీఎఫ్ఓ కార్యాలయంలో జిల్లా ఆటవిశాఖ అధికారి నీరజ్ కుమార్ టేబ్రివల్ తో కలిసి ఆనంద్ ను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ... ఐటిడిఏ సహకారంతో గిరిజన కళాకారులకు ఆర్థిక తోడ్పాటును అందించడంతో అటవీశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఎగ్జిబిషన్ లో జిల్లాకు చెందిన కళాకారుడు అత్యంత కళా ప్రదర్శనను ప్రదర్శించిన చిత్రాలకు గుర్తింపు లభించిందని తెలిపారు. జిల్లాలోనూ గిరిజన కళాకారులకు వర్క్ షాప్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. గిరిజనులోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. గిరిజనుల సంప్రదాయాలపై కళాత్మక ప్రదర్శనలు అందరి ని ఆకట్టుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.