calender_icon.png 20 March, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయల సాగుకు ప్రోత్సాహం

18-03-2025 12:30:24 AM

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): అర్బన్ ఏరియాలకు ద గ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రో త్సహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నా రు.

శాసన మండలిలో విత్తన ప్రో త్సాహకాలు, ఉద్యాన పంటల సాగు పై పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు తుమ్మల సమాధానం ఇ చ్చారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తి కో సం రైతులకు ప్రోత్సాహకాలను అం దిస్తున్నామన్నారు. నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకునే చట్టం కేంద్ర పరిధిలో ఉందని, అందుకే తాము ఏమీ చేయలేకపోతున్నాని సమాధానమిచ్చారు.