24 May, 2026 | 3:35 PM

Breaking News

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మెడికల్ కళాశాలకు పెట్టాలి   •   అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •  

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

14-01-2026 09:09 PM

గుండాల,(విజయక్రాంతి): గ్రామీణ క్రీడాకారులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు, సుద్దాల గ్రామ సర్పంచ్ గడ్డమీది మహోదయ గౌడ్. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం సుద్దాల యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. వాలీబాల్ క్రీడలో ప్రథమ బహుమతి బ్రాహ్మణపల్లి, రెండో బహుమతి సుద్దాల టీంలు, కబడ్డీలో సుద్దాల లయన్స్ యూత్ మొదటి బహుమతులు గెలుచుకున్నారు.

గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీతో పాటుగా సీల్డ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా వైస్ చైర్మన్ గడ్డమీది పాండరీ, ఉప సర్పంచ్ కాసం నగేష్, మాజీ ఎంపీటిసి  బడక మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ బత్తిని రవి, కొండపల్లి మొగులాల్, కుమార్, భిక్షం, క్రీడా నిర్వాహకులు, ప్రజలు క్రీడాకారులు పాల్గొన్నారు.