- పెట్టుబడి పరిమితి 2.5 రెట్లు పెంపు
- రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు రుణాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్-2025లో ఎంఎస్‌ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు)లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నా రు. ఈమేరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రస్తుత రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు క్రెడిట్ గ్యారెంటీ కవర్(రుణాలు) ప్రకటించా రు. ఎంఎస్‌ఎంఈ వర్గీకరణకు పెట్టుబడి పరిమితిని 2.5 రెట్లు పెంచాలని ప్రభుత్వం తెలిపింది.
ఎంఎస్‌ఎంఈ వర్గీకరణ కోసం టర్నోవర్ పరిమితి కూడా రెట్టింపు చేయనున్నారు. దీని ద్వారా దేశంలోని ఉత్పాదక రంగాన్ని వేగవంతం చేయడమే కాక, దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
రెండో గ్రోత్ ఇంజిన్‌గా..
ఎకనామికల్ గ్రోత్ రెండో ఇంజిన్‌గా ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యమిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం కోటికి పైగా నమోదిత ఎంఎస్‌ఎంఈలు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, 5.7 కోట్ల తయారీ, సేవలను అందిస్తున్నాయన్నారు. దేశ ఉత్పత్తి రంగంలో 36 శాతం ఉత్పత్తి చేస్తూ భారత దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
ఎగుమతులకు రూ.20 కోట్ల రుణాలు..
ఎంఎస్‌ఎంఈల ఎగుమతులకు రూ.20 కోట్ల రుణాలు ఇస్తు న్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించా రు. ప్రస్తుతం దేశంలో కోటికిపైగా ఎంఎస్‌ఎంఈ కంపెనీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశం ఉత్పత్తుల్లో 45 శాతం వాటా ఎంఎస్‌ఎంఈలదేనని నిర్మలా స్పష్టం చేశారు. ఉద్యం పోర్టల్‌లో నమోదైన సూక్ష్మ పరిశ్రమల కోసం 5లక్షల పరిమితితో కస్టమైజ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెడతామని, మొదటి సంవత్సరంలో 10లక్షల కార్డులు జారీ చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.