calender_icon.png 14 February, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవార్లకు ఎదుర్కోళ్లు

14-02-2025 01:05:25 AM

హాజరైన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి 

 రాజేంద్రనగర్  ఫిబ్రవరి 13(విజయక్రాంతి),: మినీ మేడారం జాతరలో భాగంగా సమ్మక్క, సారక్క అమ్మవార్లకు గురువారం ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఉదయం అమ్మ వాళ్లకు ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత భీమార్జున్ రెడ్డితోపాటు వందలాదిమంది భక్తులు వేద ప్రాంతాల నుంచి జాతరకు హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. 

 రాజేంద్రనగర్ పోలీసులు ఎదుర్కోళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకుడు చంద్రకుమార్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు అమ్మవార్లకు ప్రవేశంతో జాతర ముగుస్తుందని చంద్రకుమార్ తెలిపారు.