calender_icon.png 30 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

30-10-2024 03:35:42 AM

ఆర్మీ అంబులెన్స్‌పై దాడిచేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

అఖ్నూర్ సెక్టార్ అటవీ ప్రాంతంలో వెంటాడి మరీ ఎన్‌కౌంటర్

జమ్ముకశ్మీర్, అక్టోబర్ 29: జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్ ఎల్‌ఓసీ సమీపంలో ఆర్మీ కాన్వాయిలోని అంబులెన్స్‌పై సోమవారం కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్లో ఒకరిని అదేరోజు మట్టుబెట్టిన భారత సైన్యం.. మరుసటి రోజు(మంగళవారం) మిగిలిన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది. కాన్వాయ్‌పై దాడి అనంతరం అఖ్నూర్ సెక్టార్‌లోని సుందర్‌బన్ అటవీ ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నట్లు గుర్తించిన ఎన్‌ఎస్‌జీ కమాండోల ప్రత్యేక బృందం భద్రతా బలగాలతో కలిసి ఆ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అటవీ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ భవనంలో ఉగ్రవాదులు దాగిఉన్నట్లు గుర్తించిన సైన్యం ఆ ప్రాంతాన్ని అష్టదిగ్భందనం ఉగ్రవాదులను మట్టుబెట్టింది.