10-02-2025 01:01:56 AM
ఛత్తీస్‌గఢ్‌లో తుపాకుల మోత
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 9 (విజయక్రాంతి)/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దండ కారణ్యంలో తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర పోరు జరిగింది. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, పలువురు మావోయిస్టులు గాయపడ్డారు.
మృతుల్లో 18 మంది పురుషులు కాగా, 13 మంది మహిళలని తెలిసింది. ఎన్‌కౌంటర్‌ను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పాటి ల్ ధ్రువీకరించారు. జనవరి 6వ తేదీన మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో భద్ర తా దళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేశారు. ఘటనలో డ్రైవర్‌తో పాటు ఎనిమిది మంది డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్‌తో మృతిచెందారు. ఘటనను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను సీరియస్‌గా తీసుకున్నాయి.
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. తాజాగా పశ్చి మ బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందుకున్న పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు డిస్ట్రిక్ రిజర్వ్ గ్రూప్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), బస్తర్ ఫైట ర్ ఫోర్స్, కోబ్రా బృందాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య గంట పాటు కాల్పులు కొనసాగాయి. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ ప్రాంతానికి పరారయ్యా రు.
అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించి, వాటిని నారాయణ్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరొకొందరు మావోయిస్టులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
ఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్స్, సెల్ఫ్ లో డింగ్ రైఫిల్స్, గ్రెనేడ్ లాంచర్లు, పెద్దసంఖ్య లో తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఎ దురుకాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తు తం సుమారు 600 మంది జవాన్లు కూం బింగ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు ప్రస్తుతం మృత దేహాలను గుర్తించే పనిలో పడ్డారు.
ఇద్దరు జవాన్లు కూడా మృతి..
ఇదే ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీ వ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు డీఆ ర్జీ జవాను కాగా, మరొకరు ఎస్టీఎఫ్‌కు చెం దిన జవాను.
ఇది రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్..
ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద భారీ ఎన్‌కౌంటర్ ఇది. గతంలో జరిగిన భా రీ ఎన్‌కౌంటర్‌లో 41 మంది మావోయిస్టు లు మృతిచెందగా, తాజా ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఒడిశా సరిహద్దులోని గరి యాబంద్, నౌపాడ ప్రాంతాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మందికిపై మా వో యిస్టులు మృతిచెందారు.
ఇలా గడిచిన నెల రోజుల్లో సుమారు 100 మందికిపైగా మా వోయిస్టులు మృతిచెందారు. గతేడాది చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 219 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 49 మంది మావో యిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది. దీనిలో భాగంగా భద్రతా దళాలతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని జల్లెడ పట్టిస్తున్నది.
జవాన్లకు అభినందనలు: సీఎం విష్ణుదేవ్ సాయ్
ఎన్‌కౌంటర్ ఘటనపై సీఎం విష్ణుదేవ్ సాయ్ స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు. జవాన్లు ధైర్యసాహసాలతో నకల్సిజాన్ని తుదముట్టిస్తున్నారని, వారికి తన అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఎదురు కా ల్పుల్లో మృతిచెందిన ఇద్దరు జవాన్ల మృతి తనను కలచివేసిందని, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు.
2026 మార్చి 31 నాటికి నక్సలిజం నిర్మూలన
భారత భద్రతకు సంబంధించి ఇది పెద్ద విజయం. నక్సల్ రహిత భారత్ మా లక్ష్యం. ఇం దులో భాగంగానే గతేడాది 219 మంది మావోయిస్టులను మట్టుపెట్టాం. తాజా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లను కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుం బాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఇకపై నక్సలిజం కారణంగా ఏ ఒక్క పౌరుడూ మృతిచెందకూడదు. 2026 మార్చి 31 నాటికి భారత్‌లో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా