26-03-2025 12:47:09 AM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోమారు రక్త మోడింది. మంగళవారం బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలు పెద్దఎత్తున ఆయుధసామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇన్సాస్ 303, 315 తుపాకులు లభించినట్టు తెలుస్తోంది. ‘బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు అడవుల్లో చాలామంది నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో డీఆర్‌ఎఫ్ బలగాలు, యాంటీ నక్సల్స్ ఆపరే షన్‌ను ప్రారంభించాయి’ అని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు డీకేఎస్ సీఎం సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి మృతి చెందినట్లు తెలుస్తోంది. సుధాకర్ వరంగల్‌కు చెందిన వ్యక్తి. 30 మంది మావోయిస్టులను మట్టుబెట్టి వారం కూడా గడవకముందే భద్రతా దళాలు మరో విజయం సాధించాయి. ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో 90మంది నక్సల్స్ మృతిచెందారని తెలుస్తోంది.