calender_icon.png 22 April, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్

22-04-2025 01:59:39 AM

  1. జార్ఖండ్ బొకారో జిల్లాలో ఎదురుకాల్పులు

కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత మాంఝీ మృతి

10 లక్షల రివార్డుతో ఇద్దరు నేతలు

ఏకే సహా దేశీయ తుపాకులు స్వాధీనం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ బొకా రో జిల్లా లాల్‌పానియా ప్రాంతంలోని లుగు మౌంటేన్ ఏరియాలో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు అగ్రనేత ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ ఉన్నా డు. అరవింద్, రామ్ మాంఝీ అనే మరో ఇద్దరు మావోయిస్టులపై రూ. 10 లక్షల చొప్పున రివార్డు ఉంది.

ఈ సంయుక్త ఆపరేషన్‌ను సీఆర్‌పీఎఫ్, కోబ్రా, జార్ఖండ్ పోలీసు లు చేపట్టారు. ఉదయం 5.30 గంటల సమయంలో లుగు హిల్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. భద్రతా దళాలకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. 2026 మార్చి 31 వరకు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని  హోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారు. 

కేంద్ర కమిటీ సభ్యుడు మాంఝీ చరిత్ర పెద్దదే

కాల్పుల్లో మరణించిన ప్రయాగ్ మాంఝీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నా డు. మాంఝీ ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేవాడు. జార్ఖండ్, ఛత్తీస్‌గ ఢ్, ఒడిశా, బీహార్ జిల్లాల్లో దాదాపు 100 దాడులు చేశాడు. మాంఝీపై అనేక కేసులతో పాటు కోటి రూపాయల రివార్డు కూడా ఉం ది. ధన్‌బాద్ జిల్లాలోని దల్‌బుద అతడి స్వగ్రా మం. ఘటనా స్థలిలో ఏకే ఇతర దేశీయ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాది జార్ఖండ్‌లో 13 మంది మావోయిస్టు లు ప్రాణాలు కోల్పోయారు. పలువురు దళ కమాండర్లతో పాటు అనేక మంది లొంగిపోయారు. తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించిన ప్రయాగ్ మాంఝీ భార్యను ఏడాది క్రితమే పోలీసులు అరెస్ట్ చేయగా.. క్యాన్సర్ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. 

బీజాపూర్‌లో పేలిన ఐఈడీ.. అమరుడైన జవాన్ 

చర్ల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మనోజ్ పూజారి అనే 26 ఏండ్ల జవా న్ ఐఈడీ ప్రెజర్ బాంబ్ పేలి అమరుడయ్యాడు. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో జవాన్‌ను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ అమర్చారు.