calender_icon.png 1 April, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

29-03-2025 11:58:55 AM

16 మంది మావోయిస్టు మృతి 

ఇతర జవాలకు గాయాలు 

కొనసాగుతున్న కాల్పులు 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది 

చర్ల, (విజయక్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా(​​Bijapur district) సుక్మా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఎన్‌కౌంటర్‌ ఇప్పటివరకు మొత్తం 16 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి పెద్ద మొత్తంలో ఎకే 47, ఎస్ఎల్ఆర్, ఐఎన్ఎస్ఎఎస్ (INSAS) రైఫిల్, 303 రైఫిల్, రాకెట్ లాంచర్, బీజీఎల్(BGL) లాంచర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

డిఆర్ జి సుక్మా సిఆర్పిఎఫ్ సంయుక్త దళాలు బీజాపూర్ ఆపరేషన్‌లో భాగంగా పాల్గొన్నాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లను గుర్తిస్తున్నారు.  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు డిఆర్ జి సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికుల పరిస్థితి సాధారణంగా ఉంది. ప్రమాదం నుండి బయటపడింది. సుక్మా జిల్లాలోని కేరళపాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి నిఘా సమాచారం ఆధారంగా, డిఆర్ జి  సుక్మా, సిఆర్పిఎఫ్  ల సంయుక్త బృందం మావోయిస్టు  వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరింది. ఈ ఆపరేషన్ శనివారం ఉదయం 08 గంటల నుండి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇంకా చాలా మంది మావోయిస్టులు మరణించే  లేదా గాయపడే అవకాశం ఉంది. పరిసర ప్రాంతంలో ఇంకా పెట్రోలింగ్, సెర్చ్  ఆపరేషన్ కొనసాగుతోంది.