calender_icon.png 1 April, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోయిస్టులు మృతి

29-03-2025 09:39:17 AM

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్(Encounter) జరిగిందని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు(chhattisgarh police) ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసుల సమాచారం. గోగుండా కొండపై ఉపంపల్లిలో ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

సుక్మా జిల్లా(Sukma District)లో ఇది కూడా భారీ ఎన్‌కౌంటర్ గా చెప్పవచ్చు. గతంలో 13 మంది మావోయిస్టు లను భద్రతా బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసింది. కెర్లపాల్ పోలీస్ స్టేషన్(Kerlapal Police Station) పరిధిలోని అడవిలో ఈ కాల్పులు జరిగాయని, అక్కడ భద్రతా దళాల ఉమ్మడి బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరిందని ఒక అధికారి తెలిపారు. కెర్లపాల్ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికిపై సమాచారం ఆధారంగా శుక్రవారం రాత్రి ప్రారంభించిన ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force) సిబ్బంది పాల్గొన్నారని ఆయన చెప్పారు. అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలు ఎదురుచూస్తున్నామని అధికారి తెలిపారు.