calender_icon.png 31 March, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

28-03-2025 12:17:06 AM

ముగ్గురు పోలీసులు కూడా.. 

అక్రమ మార్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టులు..

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కథువా జిల్లాలో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు పోలీసులు కూడా వీరమరణం పొందారు. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదుగురు టెర్రరిస్టులు జుతానా ప్రాంతంలోని దట్టమైన అడవిలో దాక్కున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని కాల్పులు జరిపాయి.

ఆదివారం రోజు తప్పించుకున్న టెర్రరిస్టులే ఈ రోజు కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. భద్రతాబలగాలను ఎదుర్కోలేక టెర్రరిస్టులు పారిపోయారు. టెర్రరిస్టులు పారిపోయేకంటే ముందు దాదాపు అరగంట పాటు ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీస్, ఆర్మీ, బీఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ, సీఆర్పీఎఫ్ దళాలు కలిసి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అధునాతన టెక్నాలజీతో తీవ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి.