calender_icon.png 12 January, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

20-12-2024 12:07:03 AM

* ఐదుగురు ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్‌లో తనిఖీలు చేపడుతుండగా ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది సైతం ప్రతిదాడికి దిగి ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో ఉగ్రముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు, భద్ర తా బలగాలకు మధ్య వరుస కాల్పులు జరుగుతున్నాయి. ఫూంఛ్, రాజౌరీ జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రముఠాలు తాజాగా ఇతర జిల్లాల్లోనూ క్రియాశీలకంగా మారాయి. ఈ ముఠాలపై భద్రతా బలగాలు దృష్టిసారించాయి.