ఐదుగురు మావోయిస్టుల మృతి
న్యూఢిల్లీ, జనవరి 12: ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉద యం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మా వోయిస్టులు మృతి చెందారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) స్థానిక పోలీసులు సంయుక్తంగా మావోయిస్టుల కోసం కూబింగ్ చేపట్టారు.
ఈ సందర్భంగా మావోయిస్టులు ఎదురుపడ టంతో కాల్పు లు జరిగాయి. మద్దేడ్ పీఎస్ పరిధి బందిపురా అటవీప్రాంతంలో ఈ కా ల్పులు జరిగాయి. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నారాయణ్‌పూర్ జిల్లాలోనూ పోలీసులు కూబింగ్ నిర్వహిస్తున్నారు.