- నలుగురు మావోయిస్టులు హతం
- హెడ్ కానిస్టేబుల్ మృతి..
రాయ్‌పూర్, జనవరి 5: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తుపాల మోత మో గింది. మావోయిస్టులు, భద్రతా దళా ల మధ్య భీకర పోరు జరిగింది. కా ల్పుల్లో నలుగురు మావోయిస్టులతో పాటు హెడ్ కానిస్టేబుల్ కూడా మృతిచెందాడు.
అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్ర మంలో మావోయిస్టులు ఎదురుపడికి దిగారు. జవాన్లు అ ప్రమత్తమై ఎదురుకాల్పులు ప్రారంభించారు. సుమారు అరగంట పాటు ఫైర్ ఎక్సేంజ్ జరిగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతంలోకి పరారయ్యారు. జవాన్లు అనంత రం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో
నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ కరమ్ మృతదేహాన్ని గుర్తించారు. అలాగే పెద్ద ఎత్తున మరణాయుధాలు, మందుగొండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.