న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని కొంటాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మరణించారు. సుక్మా జిల్లా కొంట పోలీస్ స్టేషన్ పరిధిలో బెడ్జి అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ వెల్లడించారు. భద్రతా దళాలు ఘటనాస్థలంలో మూడు ఆటోమేటిక్ తుపాకీలతో సహా అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశిస్తున్నారనే సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) ఈ ఆపరేషన్ ప్రారంభించింది. కాగా, ఎన్‌కౌంటర్ జరిగినట్లు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి సుందర్‌రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆయుధాల రకాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.