calender_icon.png 1 March, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు

01-03-2025 12:14:05 PM

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం నక్సలైట్లు, భద్రతా సిబ్బంది మధ్య ఎన్‌కౌంటర్(Encounter) జరిగిందని పోలీసులు తెలిపారు. కిష్టారామ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అడవిలో ఈ కాల్పులు జరిగాయని, అక్కడ భద్రతా సిబ్బంది ఉమ్మడిగా నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరారని ఒక అధికారి తెలిపారు. శుక్రవారం ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికిపై సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్, CRPF ఎలైట్ యూనిట్) సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని అధికారి తెలిపారు.