calender_icon.png 19 January, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్

22-10-2024 02:43:23 AM

  1. నలుగురు మావోయిస్టులు మృతి
  2. ఓ జవానుకు గాయాలు
  3. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో పౌరుడిని చంపిన నక్సల్స్

నాగ్‌పూర్, అక్టోబర్ 21: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరౌలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయి స్టులు మతిచెందారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కమాండో బృందం సోమవారం కూంబింగ్ జరిపింది.

ఈ క్రమంలో కమాం డో బృందానికి మావోయిస్టులు ఎదురుపడ గా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాన్ గాయపడగా నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పో యారు. గాయపడిన జవాన్‌ను చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. కాగా అక్టోబర్ మొదటి వారంలో మావోయిస్ట్ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆ కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మరణించారు. 

ఇన్ఫార్మర్ నెపంతో హత్య

పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్నారనే అనుమానంతో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన మార్కం అండా అనే వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు. మార్కంను పదునైన ఆయుధంతో పొడిచి పంపినట్టు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. ఈ నెల 8న కూడా 55ఏళ్ల వ్యక్తిని హత్య చేసినట్టు చెప్పారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 52 మంది సామాన్య ప్రజలు మావోయిస్టుల వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దురాఘతాలకు పాల్పడుతున్న మావోయిస్టులను మట్టుబెట్టడానికి కూంబింగ్ ఆపరేష న్ కొనసాగుతుందని చెప్పారు.