calender_icon.png 5 October, 2024 | 8:54 PM

అల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎనమల్ల నరేష్ కు సన్మానం

05-10-2024 05:47:53 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ IMA అధ్యక్షుడిగా ఎన్నికైన ఎనమల్ల నరేష్ ను శనివారం ఆయన నివాసంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మర్యాద పూర్వకంగా కలిసి వారికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సమాజంలో డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తారని అలాంటి డాక్టర్ సంఘానికే సేవలు చేసే అవకాశం డాక్టర్ నరేష్ కు రావడం చాలా సంతోషంగా ఉందని నరేష్ నాయకత్వంలో IMA ఈ కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మాజీ కార్పోరేటర్ సాదవేణి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమాసారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.