భజన్‌కౌర్, దీపికా కుమారి ఓటమి
పారిస్: విశ్వక్రీడల్లో భారత ఆర్చర్ల పోరా టం ముగిసింది. ఈసారి ఒలింపిక్స్‌లోనూ మన ఆర్చర్లు ఒక్క పతకం లేకుండానే రిక్త హస్తాలతో స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. మహిళల వ్యక్తిగత విభాగంలో పతకంపై ఆశలు రేపిన భజన్‌కౌర్, దీపికాకుమారి నిరాశపరిచారు. భజన్ కౌర్ ప్రిక్వార్టర్స్‌కే పరిమితం కాగా.. క్వార్టర్స్‌కు దూసుకొచ్చిన దీపిక మాత్రం కీలకపోరులో చేతులెత్తేసింది. శనివారం జరిగిన క్వార్టర్స్ పోరులో దీపికా 4 తేడాతో సుయోన్ నామ్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. అంతకముందు ప్రిక్వార్టర్స్‌లో దీపిక 6 జర్మనీ ఆర్చర్ మిచెల్లె క్రొప్పెన్‌ను ఓడించింది. నాలుగోసారి ఒలింపిక్స్ ఆడుతున్న దీపికా కుమారి ఈసారి కూడా పతకం గెలవడంలో నిరాశపరిచింది.
మరో మహిళా ఆర్చర్ భజన్ కౌర్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో భజన్ 5 ఇండోనేషియా ఆర్చర్ దియాండా చేతిలో ఓటమిపాలైంది. శుక్రవారం ఆర్చరీ మిక్సడ్ టీమ్ విభాగంలో ధీరజ్ జంట కాంస్య పతక పోరులో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈసారి ఒలింపిక్స్‌కు ఆర్చరీ నుంచి ఆరుగురితో కూడిన బృందం వెళ్లింది. వీరిలో తరుణ్‌దీప్, ప్రవీణ్ జాదవ్, అంకితలు తొలి రౌండ్‌లోనే వెనుదిరగ్గా.. ధీరజ్ ప్రిక్వార్టర్స్‌లో ఓటమిపాల య్యాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మన ఆర్చర్లు పతకంతో తిరిగొస్తారనుకుంటే రిక్త హస్తాలతో స్వదేశానికి రానున్నారు.