18-04-2025 01:44:47 AM
కాటారం, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : మండలంలోని దేవరాం పల్లి గ్రామంలో మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. గత మూడు నెలల నుండి అష్ట కష్టాలు పడుతున్నప్పటికి తాగునీటి సౌకర్యం కల్పించలేక పోతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజల ఇక్కట్లను తీర్చడం లేదని మంత్రి తీరుపై ఆయన మండిపడ్డారు. సొంత మండలంలో అభివృద్ధి చేయని మంత్రి, రాష్ట్రాన్ని ఏమీ అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పాగే రంజిత్, మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, శ్రీశైలం యాదవ్, స్వామి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.