calender_icon.png 23 February, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం

21-02-2025 04:29:24 PM

హైదరాబాద్: నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodara Raja Narasimha) మాట్లాడుతూ...  మహిళలను ఆర్థికంగా బలోపేత చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడవనున్నాయని తెలిపారు. దేశంలో 1931లో జరిగిన కులగణన మళ్లీ ఇంతవరకు జరగలేదని ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వాత తెలంగాణలో మాత్రమే కులగణన జరిగిందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వికారాబాద్ జిల్లాను సందర్శించారు. అక్కడ ఆయన దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి ఎల్లమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సందర్శనలో భాగంగా ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి ఎల్లమ్మ అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను (పవిత్ర నైవేద్యాలు) అందజేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ, ఇతర ప్రముఖులు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.