calender_icon.png 1 March, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి నైపుణ్య శిక్షణతో ఉపాధి

01-03-2025 01:07:40 AM

 జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పాల్వంచ, ఫిబ్రవరి 28 ( విజయక్రాంతి) వృత్తి నైపుణ్య శిక్షణ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం పాల్వంచలోని నవ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఐటిఐ విద్యార్థుల కు ధ్రువీకరణ పత్రాలు అందజేయు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పార్టీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణ కేంద్రంలోని అన్ని తరగతి గదులను పరిశీలించి  శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ ఎలా ఉంది, ఏ కోర్స్ శిక్షణ తీసుకుంటున్నారు అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కేంద్రంలో ఎంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

నంతరం కలెక్టర్ మాట్లాడుతూ వృత్తి విద్యలో శిక్షణ పొందిన విద్యార్థులు పరిశ్రమల స్థాపన ద్వారా పారిశ్రామిక వేత్తలుగా ఎదగొచ్చని ఆయన అన్నారు. పదవ తరగతి తర్వాత ఐదు  సంవత్సరాల పాటు విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అని, అలాంటి వారికి తక్షణ ఉపాధి కల్పించే వృత్తి విద్యా కోర్సులు ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ఇది వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందన్నారు.

ప్రపంచంలో పెరుగుతున్న సరాలకు అనుగుణంగా సాంకేతిక సిబ్బంది డిమాండ్ బాగా ఉందని, విద్యార్థులు వృత్తి విద్య కోర్సులు ,శిక్షణ పూర్తి చేయడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చు అని కలెక్టర్ తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి అయిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా ధ్రువపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, నవ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్, శిక్షణ కేంద్ర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.