calender_icon.png 6 November, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక అభివృద్ధితో ఉపాధి

30-06-2024 01:35:16 AM

 స్పీకర్ ప్రసాద్ కుమార్

వికారాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): పర్యావరణ పర్యాటక అభి వృద్దిలో భాగంగా పేదలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అనంతగిరి పర్యాటక అభివృద్ది కొరకు చేపట్టాల్సిన పనులపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.  సమావేశంలో అటవీ, దేవాదాయ, మిషన్ భగీరథ, భూగర్బ జలాలు, మున్సిపల్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బం గా స్పీకర్ మాట్లాడుతూ.. జిల్లాలో పర్యావరణ పర్యాటక అభివృద్దికి స్వచ్చ దర్శన్ పథకం కింద 110 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో 213 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంలో స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అనంతగిరితో పాటు కోట్‌పల్లి ప్రాజెక్టు, సర్పన్‌పల్లి, శివసారగ్, లక్నాపూర్, దామగుండం ప్రాంతాలను అభి వృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు.