calender_icon.png 4 April, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి అవకాశం కల్పించాలి

03-04-2025 05:04:07 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా తమకు అవకాశం కల్పించాలని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వాన్ని కోరారు. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో జనకాపూర్, ఆసిఫాబాద్ గొడవల్లి, తారకరామ నగర్ బజార్ వడి తదితర ప్రాంతాలకు చెందిన ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కరువైంది. ఈ ప్రాంతాల కూలీలకు రాజంపేట గ్రామపంచాయతీ యందు జాబ్ కార్డులను విలీనం చేసి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

మున్సిపాలిటీ ఏర్పాటుతో పేద ప్రజలైన తమకు అన్యాయం జరిగిందని అధికారులు మానవతా దృక్పథంతో తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 4న రాస్తారోకో, 5న కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉపాధి హామీ కూలీల సంఘం అధ్యక్షురాలు గరిగెల పద్మ, ప్రధాన కార్యదర్శి పావని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షురాలు స్వరూప, కోశాధికారి మంజుల, సహాయ కార్యదర్శి సుగుణ తదితరులు పాల్గొన్నారు.