బీడీకార్మికులకు నెలలో 26 రోజుల పని కల్పించాలి
తెలంగాణ బీడీ కాంగార్ ఫెడరేషన్ డిమాండ్
కామారెడ్డి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కరువైందని తెలంగాణ బీడీ కాంగార్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు లక్ష్మణ్ అన్నా రు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి రోడ్డు నుంచి బీడీ కార్మికుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీ డీ ప్రతి బీడీ కార్మికురాలికి నెలకు 26 రోజు ల పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 40 బీడీ సంఘాలు తెలంగాణ బీడీ కాంగార్ ఫెడరేషన్ ద్వారా కంపెనీలపై కార్మి క శాఖలో కేసులు పెట్టినట్టు చెప్పారు.
అయి నా కూడా అధికారులు కంపెనీలపై దాడులు చేసిన దాఖలలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీడీ కార్మికులపై ప్రేముంటే కామా రెడ్డిలో బీడీ వెల్ఫేర్ ఆసుపత్రిని, ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్లు మంజూరు చేయాలని, నెలకు రూ.4,016 పెన్షన్లు అమ లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు అనుమల గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివ్వంది సత్యం, ఐరేని రాజేందర్, పరవ్వ, రాజమణి, రజనీకాంత్, నర్సిం లు, లింగం, మల్లేశం పాల్గొన్నారు.