01-03-2025 01:42:17 AM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి) : ఖానాపూర్ నియోజవర్గంలోని షెడ్యూల్ ప్రాంతాల్లో గల ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ను కోరారు. శుక్రవారం మంత్రి అధ్యక్షతన హైదరాబాద్ లో ఎంఎస్‌ఎంఈ పాలసీ పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు పూర్తిగా షెడ్యూల్ ప్రాంతాలని, ఇందులో అనేక మంది ఉన్నత చదువులు చదువుకొని నిరుద్యోగులగా ఉన్నారని, వారికీ మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కుటిర, చిన్నతరహా పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. తోటి, కోలాం తెగకు చెందిన ఆదివాసీ లు వెదురు తో అనేక రకాల నిత్యావసర పనిముట్లు తయారు చేస్తారన్నారు. ఫారెస్ట్ ద్వారా కొంత వెసులుబాటు కల్పించి వారికీ ఉపాధి మార్గాలను చూపెట్టాలన్నారు.