calender_icon.png 19 January, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికులకే ఉపాధి అవకాశాలివ్వాలి

19-01-2025 12:17:31 AM

* అంబుజా సిమెంట్ పరిశ్రమ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల డిమాండ్

నల్లగొండ, జనవరి 18 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్‌పహాడ్ గ్రామ సమీపంలో అంబుజా సిమెంట్ (పెన్నా సిమెంట్) మైనింగ్ విస్తరణపై శనివారం కాలుష్య నియంత్రణ మండ లి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.

గణేష్ పహాడ్‌లో గనుల లీజ్ పొడిగిం పు, సూర్యాపేట జిల్లా శూన్య పహాడ్‌లో కొత్త గనుల విస్తరణ(సున్నపురాయి తవ్వకాలు)పై స్థానికుల నుంచి వేర్వేరుగా అభిప్రాయాలు స్వీకరించారు. పరిశ్రమలో స్థానికులకే ఉపా ధి అవకాశాలు కల్పించాలని, సీఎస్‌ఆర్ కింద కేటాయించే నిధులతో గ్రామాలను అభివృద్ధి చే యాలని స్థానికులు కోరారు.

స్థానికుల డి మాండ్లకు సంస్థ యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో సజావుగా ప్రజాభి ప్రాయ సేకరణ ముగిసింది. గణేష్‌పహాడ్‌తో పాటు శూన్యం పహాడ్ గ్రామాల పరిధిలో మొత్తం 354 హెక్టార్లలో గనులను విస్తరించి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 1.8 మిలియన్ టన్నులకు పెంచాలన్న ఉద్దేశంతో యాజమాన్యం గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసింది.

గతంలోనే రెండుసార్లు ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు నిర్ణయించినా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా మూడోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. లగచర్ల ఘటన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటారేమోనన్న అనుమానంతో పలువురు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, కాలుష్య నియంత్రణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయలక్ష్మీ, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.