calender_icon.png 5 March, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు

04-03-2025 08:56:06 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేశ్ బాబు..

హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏవియేషన్, కార్పొరేట్ కెరీర్ గైడెన్స్..  

ఎల్బీనగర్: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్ బాబు అన్నారు. హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  మంగళవారం ఏవియేషన్ రంగంలో ఉపాధి అవకాశాలపై  సదస్సు కెరీర్ గైడెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేశ్ బాబు, డాక్టర్ భానుప్రసాద్, వక్త రాంబాబు మాట్లాడుతూ... అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి, వివిధ ప్రభుత్వ, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను విద్యార్థులకు వివరించారు.

కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. ఏవియేషన్ రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, విద్యార్థులు అవకాశాలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ, కోఆర్డినేటర్లు నర్సింహ, నాగరాజు, మల్లేశం, అధ్యాపకులు పాల్గొన్నారు.