calender_icon.png 1 April, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

27-03-2025 01:17:23 AM

రాజీవ్ వికాస్ పథకంపై సమీక్షలో తాసిల్దార్ నాగరాజు 

కాటారం, మార్చి 26 (విజయక్రాంతి): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికసాయం అందించడానికి ప్రభుత్వం చేపట్టిన  రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని  కాటారం తాసిల్దార్ నాగరాజు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం లో  ఎంపీడీఓ అడ్డురి బాపు, ఎం పి ఓ వీరస్వామి,  మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు  యువతి,  యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించ డానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి వ్యాపారాల్లో రాణించేందుకు రాయితీని పొందవచ్చుని తెలి పారు.

రాజీవ్ యువ వికాస పథకంలో సుమారు 75 రకాల యూనిట్ల ఏర్పాట్లుకు పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా  డిఆర్డీవో ఉంటారని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన యువతి యువకులు వ్బుసైట్ అధికారిక https:// tgobmms.gg.gov.in ఆన్లైన్ దరఖాస్తు చేయాలని, ప్రింట్ తీసిన దరఖాస్తును ఎంపిడిఓ,కు అందచేయాలని తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారై, పరిమిత ఆదా య వనరుల గల బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ యువత రేషన్, పాన్ కార్డు ఫోన్ నెంబర్, ఫొటో, ఆధార్ కార్డ్, కుల, ఆదాయ, ధ్రువీ కరణ పత్రాలను దరఖాస్తులో నమోదు చేయాలన్నారు.  ఆఖరు తేదీ 05.04.2025 వరకు  ఉందని అన్నారు.