calender_icon.png 3 October, 2024 | 3:59 AM

ఆరెక్స్ బెనిఫిట్స్‌తో 300 మందికి ఉపాధి

03-10-2024 02:06:46 AM

సామర్థ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆరెక్స్ బెనిఫిట్స్ అనే సంస్థ సామ ర్థ్య కేంద్రం ఏర్పాటుతో 300 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ సంస్థ దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు దక్కుతా యని తెలిపారు. ఈ సంస్థ తనకు క్లయింట్ గా ఉన్న ఫార్మసీలకు లాభాలు పెంచుకోవడంలో తోడ్పడుతుందన్నారు. హైదరాబాద్ నైపుణ్య కేంద్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రొడెక్ట్ ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని వెల్లడించారు.

రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత అపారంగా ఉన్నందున బహుళ జాతి సంస్థలకు చుక్కానిగా మారిందని ఆయన తెలిపా రు. వ్యాపార విస్తరణకు అనుకూల వాతావరణం ఉండటం, మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి సమస్యలు లేనందున ఆరె క్స్ బెనిఫిట్స్ హైదరాబాద్‌ను ఎంచుకుందని వివరించారు.

ఆధునిక సాంకేతిక, జెనరేటివ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో డిజిటల్ పరివర్తన అనివార్యంగా మారిందని చెప్పా రు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఆరెక్స్ బెనిఫిట్స్ సీఈవో వెండీ బార్నెస్, సీఎఫ్‌ఓ థాడ్ క్వియాట్ కౌస్కీ, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ శేఖర్ ఖేరా, సమిట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సందీప్ శర్మ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.