డిఆర్డిఏ పిడి కిషన్...
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కిషన్ సూచించారు. శుక్రవారం మండలంలోని శంకర్ పల్లి, బొక్కలగుట్ట, సారంగపల్లి గ్రామ పంచాయతీలలో ఈజీఎస్ పథకంలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పశువుల కొట్టం, కోళ్ల ఫారం, ప్రభుత్వ పాఠశాలల ప్రహరి, సీసీ రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేసి గ్రామీలకు గ్రామీణులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఉపాధి హామీ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, డిఆర్డిఏ సీసీ కుమార్, టిఏ లు రాయమల్లు, కుమార్, సదానందం (వెలుగు), ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు పుస్తే రవికుమార్, బోగే జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.