calender_icon.png 19 April, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధిహామీ కూలీలకు 100 రోజుల పని కల్పించాలి

11-04-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కాగజ్ నగర్,ఏప్రిల్ 10(విజయక్రాంతి):జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఉపాధి కూలీలకు వంద రోజుల పని కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం  కాగజ్ నగర్ మండలం కోయవాగు గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న అభివృద్ధి ఫారం పాండ్ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కొనసాగుతున్న పనులలో ఉపాధి కూలీలకు వంద రోజుల పని కల్పించాలని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా అధిక ఉష్ణోగ్రత సమయంలో ఉదయం, సాయంత్రం వేళలలో పనులు చేపట్టాలని, పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు త్రాగునీరు, నీడ, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు సౌకర్యాలు కల్పించాలని, అత్యవసర వైద్యసేవల నిమిత్తం ప్రధమ చికిత్స కిట్లను అం దుబాటులో ఉంచాలని తెలిపారు. 

జిల్లాలోని అర్హత గల అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండల కేంద్రాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకుని ప్రభు త్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం చింతగూడ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న నర్సరీ పనులను పరిశీలించారు.

వేసవికాలం అయినందున సకాలంలో మొక్కలకు నీటిని అందించి సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.