08-04-2025 12:00:00 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): తమకు పని కల్పించాలని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో కూలీలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన దిగారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పద్మ, పావని మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనిచేసే అవకాశం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు స్వరూప, కోశాధికారి మంజుల, సహాయ కార్యదర్శి సుగుణ, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.