calender_icon.png 8 April, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పని కల్పిస్తారా లేదా...?

07-04-2025 01:54:15 PM

కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కూలీల ధర్నా

కుమ్రంభీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): తమకు పని కల్పించాలని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కూలీలు  సోమవారం కలెక్టరేట్(Collectorate) ఎదుట ఆందోళన దిగారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గరిగెల పద్మ,పావని మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Employment Guarantee Scheme) లో పనిచేసే అవకాశం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి చేస్తే గాని పుట్టగడవాని తమ కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అధికారులు స్పందించి పని కల్పించాలని కోరారు.ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కూలీలకు చెందిన జాబ్ కార్డులను రాజంపేట గ్రామపంచాయతీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఉధృతంగా పోరాటాలు చేస్తామని స్పష్టం  హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు స్వరూప, కోశాధికారి మంజుల ,సహాయ కార్యదర్శి సుగుణ, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.