29-03-2025 03:29:10 PM
బీకేెఎంయూ రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్
కరీంనగర్,(విజయక్రాంతి): తీవ్ర ఎండతో ఉపాధి హామీ పనులకు వెళ్లి పడిపోయిన సిరిసిల్ల గణపతి కి మెరుగైన వైద్యం అందించి వారికీ ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆడుకోవాలని బీకేెఎంయూ రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం రోజున తీవ్ర ఎండతో పడిపోయిన గణపతి ని 108 లో కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చగా వారిని పరమార్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో రోజులాగే ఉపాధి హామీ పనికి వెళ్లిన కార్మికులు పని ప్రదేశం గట్టిగా ఉండడం వల్ల ముందు రోజే ఆ ప్రదేశంలో నీటితో తడిపి శుక్రవారం రోజున పనికి వెళ్లగా ఎండ తీవ్రంగా ఉండడం వల్ల నీటితో పని ప్రదేశాన్ని తడిపిన చెట్ల పొదలు ఎంత తీసిన రాకపోయే సరికి ఇంటికి వెళ్లి గడ్డపార తీసుకు రావడానికి వెళ్ళుతుండగా ఎండ ఎక్కువ ఉండడంతో అక్కడే కల్లు తిరిగి పడిపోవడంతో 108 కు ఫోన్ చేయగా అంబులెన్సు వచ్చి కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేరచారని, ఇప్పటికి సంబంధిత అధికారులు అస్పత్రికి రాలేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ కూలికి ప్రమాదం జరిగిన ఇప్పటివరకు అధికారులు బాధితున్ని పరమార్శించక పోవడం బాధ్యత రహిత్యమని, ఆ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం అని వేంటనే ఉపాధి హామీ అధికారులు స్పందించి వారికీ మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకోవాలని అన్నారు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం తో పాటు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ పంపిణి చేయాలని, ఎండ ప్రమాదాల నుండి కూలీలకు రక్షణ కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రాహ్మణపల్లి యుగేందర్ నాయకులు నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.