19-02-2025 12:22:52 AM
ఎంపీడీవో నరేందర్‌రెడ్డి
యాచారం,ఫిబ్రవరి 18: జాతీయ ఉపాధి హామీ పథకం పనులను అన్ని గ్రామాలలో వేగవంతం చేయాలని ఎంపీడీవో నరేందర్ రెడ్డి ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. యాచారం మండల పరిధిలోని మల్కిస్ గూడా, మేడిపల్లి, గ్రామాలలో కొనసాగు తున్న ఉపాధి హామీ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.పనులకు సంబం ధించి కూలీలను, సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. పనులను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.కూలీలకు వేసవి కాలంలో అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు.